*గణేష్ మండప నిర్వాహకులు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్కోసం దరఖాస్తు చేసుకోండి
ప్రజా గొంతుక:షాద్ నగర్ ప్రతినిధి
గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం *షాద్ నగర్ డివిజన్* పరిధిలోని *షాద్ నగర్* లో గల విద్యుత్తు కార్యాలయo లో దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్తు డివిజనల్ ఇంజనీర్ *టీ. యాదయ్య* తెలిపారు.
ఈనెల 18 నుండి 28వ తేదీ వరకు జరగనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ సంస్థ గణేష్ మండపాల నిర్వాహకులకు సరఫరా అందించేందుకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించటంతో పాటు విద్యుత్ చౌర్యాన్ని సైతం నివారించడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 250 వాట్ల విద్యుత్ కనెక్షన్ కోసం 500 రూపాయలు, 250 నుండి 500 వాట్ల వరకు వేయి
రూపాయలు, 500 పైచిలుకు వాట్ల వరకు 1500 రూపాయలు రుసుం చెల్లించి కనెక్షన్ తీసుకోవాలని సూచించారు. వెయ్యి వాట్లపై చిలుకు విద్యుత్ వినియోగం వాడే వారికి అదనంగా ప్రతి 500 వాట్ల వరకు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ సిబ్బందికి సహకరించి భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా గణేష్ నవరాత్రులను జరుపుకోవాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ లో తొందరపాటు పడి అక్రమ కనెక్షన్ తీసుకొని ప్రమాదాలకు గురికావడంతో పాటు విద్యుత్ సంస్థకు నష్టం చేకూర్చకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు