బిఆర్ ఎస్ ఒంటెద్దు పోకడ వల్లే పార్టీ వీడాల్సి వచ్చింది తోటమళ్ళ వరప్రసాద్
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా/ ప్రతినిధి
పార్టీ కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించకుండా,ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవలు అందిస్తున్న వారిని కాదని నిన్న కాక మొన్న వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడం మొదలుపెట్టారు.పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గోకినట్లుగా ఉంది ఆ నాయకుల తీరు. అర్ధ బలం అధికార బలంతో వున్న కొందరు నాయకుల తీరుతో వుండి దళిత సామాజిక వర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తడికల లాలయ్య పార్టీకి రాజీనామా చేస్తే ఏ ఒక్క నాయకుడైన వెళ్లి ఎందుకు రాజీనామా చేశాడో తెలుసుకున్న దాఖలాలు లేవు.
మేము మొదటి నుంచి తుమ్మల మనుషులుగా చలామణి అయ్యాము.టిడిపి పార్టీ నుండి జడ్పిటిసి పదవులు పొందిన తరువాత తుమ్మల నాగేశ్వరావు,బాలసాని లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీలో చేరాము. మా నాయకులు తుమ్మల నాగేశ్వరావు బాలసాని లక్ష్మీనారాయణ మాత్రమే.మా నాయకులు తుమ్మల నాగేశ్వరావు బాలసాని లక్ష్మీనారాయణకి,మాకు గౌరవం లేని చోట మేము ఎలా ఇమడగలం మా నాయకులు బిఆర్ఎస్పార్టీని వీడటం వల్ల మేము కూడా పార్టీని వీడుతున్నాం అని మొన్ననే బిఆర్ఎస్ మండల అధ్యక్షులకు చర్ల సర్పంచ్ లతో పాటు ఓ సీనియర్ నాయకునికి ఈ విషయం చెప్పాము.మిమ్మల్ని లక్ష్మణ్ ఇంచార్జ్ తాత మధుతోను డాక్టర్ తెల్ల వెంకటరావు తోను మాట్లాడితే ఆ రోజంతా వారి వెంట తిప్పుకున్నారు.ఎటువంటి స్పందన లేదు.బీరు ,బిర్యానీ కోసం బిఆర్ఎస్ పార్టీ లో కొందరు ఎస్సీ సెల్ నాయకులు అని చెప్పుకొని సోషల్ మీడియాలో పెట్టే చౌకబారు రాజకీయాలు చేసే వారికి స్పందించవల్సిన అవసరం నాకు లేదు.