గోపాల్ నగర్ బిఆర్ఎస్ ఉప సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
గత రెండు రోజుల క్రితం కొమ్మురి ప్రతాపరెడ్డి ప్రచారంలో భాగంగా బచ్చన్నపేట మండలంలో పర్యటిస్తూ గోపాల్ నగర్ గ్రామంలో ప్రచారం నిర్వహించి, కార్యకర్తల్లో ప్రజల్లో ఉత్సాహం నింపడంతో, ఆకర్షితులై గోపాల్ నగర్ ఉపసర్పంచ్ వద్ది ఎల్లయ్య,బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మురి ప్రతాపరెడ్డి ఉప సర్పంచ్ వద్ధి ఎల్లయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వద్ధి ఎల్లయ్య మాట్లాడుతూ అభివృద్ధి కొమ్మురి నాయకత్వంలోనే జరుగుతుందని ,గత రెండు రోజుల క్రితం గోపాల్ నగర్ గ్రామానికి కొమ్మూరి వచ్చినప్పుడు నూతన గ్రామపంచాయతీని, నిర్మిస్తామని ప్రజల బాధలను తీర్చడానికి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు అద్భుతమైన పథకాలని కొమ్మురి గెలుపు కోసం గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా నీల కృష్ణ వద్ధి కనకయ్య ,బుర్రి రాహుల్, గంగరబోయిన ప్రభాకర్, నీల శ్రీధర్, నీల పెద్ద కృష్ణ, గుండెని ప్రసాద్, గుండెని శివ, తదితరులు పార్టీలో చేరారు.
గ్రామ శాఖ అధ్యక్షుడు వల్లాల సత్యనారాయణ ,బూత్ కమిటీ అధ్యక్షులు నాగేష్ ,జంపయ్య, పర్వతం యాదగిరి, ఆయిల్ మల్లయ్య,, తదితరులు పాల్గొన్నారు.