Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

ప్రజా గొంతుక పెద్దపల్లి జిల్లా :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2వ సారి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుతో నిరుద్యోగుల జీవితాలను మరోసారి రోడ్డు కిడ్చిన ప్రభుత్వం-ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్

దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం పేపర్ లీకులతో, పరీక్షల రద్దులతో మొదటి స్థానంలో నిలిచిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రెండోసారి రద్దు కావడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య పూరిత వైఖరి అని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మండిపడ్డారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మరియు ఇతర ప్రశ్నపత్రాలను అమ్ముకోవడానికి ప్రయత్నించి లక్షలాదిమంది నిరుద్యోగుల జీవితాలను రోడ్డున పడేసిన రాష్ట్ర ప్రభుత్వం పైన చేసిన అనేక ఉద్యమాల కారణంగా పరీక్షలను రద్దుచేసి నిర్వహించిన రీ ఎక్షమ్ లో కూడా సరైనటువంటి చర్యలు పాటించకుండా ఇష్టానుసారంగా గ్రూప్ -1ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి రెండోసారి కూడా పరీక్ష రద్దుకి కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండోసారి నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ వివరాలు , హాల్ టికెట్ నెంబర్ లేకుండా OMR షీట్ ఇచ్చి అసైంటిఫిక్‌ గా పరీక్ష నిర్వహించడం కారణంగా పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో రెండోసారి గ్రూప్-1 పరీక్ష రద్దు చేయడం జరిగింది.ఈ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఉద్దేశం లేదని ఎలక్షన్లు దగ్గరకొస్తున్నాయనే కారణంతో ఓటు బ్యాంకు కోసం అడప, తడప నోటిఫికేషన్లు ఇస్తూ పేపర్ లీకేజీలతో కుట్రపూరితంగా నిరుద్యోగుల జీవితాలను రోడ్డుకి ఇడుస్తున్నారని మండిపడ్డారు.దీనిలో భాగంగా పేపర్లు అమ్ముకోవడానికి ప్రయత్నించడం, ప్రశ్న పత్రాల్లో తప్పులు దొర్లే విధంగా వ్యవహరించడం ఏదో ఒక రకంగా కోర్టు ద్వారా పరీక్షను రద్దు చేయించి ఉద్యోగాల భర్తీని ఆపడం కోసం చేస్తున్న కుట్ర మరోసారి తేటతెల్లమైంది అన్నారు. నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనైతికంగా నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందని అన్నారు.గతంలో ఏబీవీపీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కి కారణమైన నిర్లక్ష్య ప్రభుత్వం పైన అనేక ఉద్యమాలు చేసి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని, పేపర్ లీకేజీకి కారణమైన టీఎస్పీఎస్సీ సెక్రటరీ ,చైర్మన్ లను తొలగించి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా మరొకసారి టీఎస్పీఎస్సీతో కుమ్మక్కై కుట్రపూరితంగా రెండోసారి పరీక్ష రద్దు కావడానికి కారణమైందని అన్నారు.గతంలో పేపర్ లీకేజీ సంఘటన పైన కనీసం స్పందించని చేతగాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి నిరుద్యోగులకు ఏ విధంగా భరోసాని ఇస్తాడో వెంటనే బహిర్గతంగా క్షమాపణ చెప్తూ తమ తప్పుని ఒప్పుకొని బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.ఏళ్ల తరబడి కొలువుల నినాదంతో ఏర్పడ్డ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు తమ సర్వస్వాన్ని ధారపోసి కోటి ఆశలతో కొలువుల కోసం కష్టపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పేపరు లీకులతో పరీక్ష రద్దులతో తొమ్మిదేళ్లుగా నియామకాలను తుంగలోకి తొక్కుతూ లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక పరిపాలించే నైతిక బాధ్యత లేదని హెచ్చరించారు .వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని పట్ల స్పందించి తప్పిదాలు ఉన్నాయని గ్రూప్-1 పరీక్షలు ఏ విధంగా అయితే రద్దు చేశారో ఆ తప్పిదాలకు కారణమైనటువంటి టీఎస్పీఎస్సీ నీ రద్దుచేసి చేసి చైర్మన్ ,సెక్రటరీ మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిర్గతంగా క్షమాపణ చెప్పి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎటువంటి నైతిక బాధ్యత లేదని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది అన్నారు.

 

 

*డిమాండ్స్*

 

1.TSPSC పేపర్ లీకేజీ కి మరియు గ్రూప్ -1పరీక్ష రద్దుకు ముఖ్యమంత్రి కెసిఆర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి.

 

2. TSPSC తప్పిదాలకు బాధ్యులైన వ్యక్తులపై న్యాయ విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

3. TSPSC నీ రద్దు చేయాలి.

 

4. అర్హులైన అనుభవం వున్నా వ్యక్తుల్ని TSPSC సభ్యులుగా నియమించాలి.

 

5.TSPSC కార్యకలాపాలు నిర్వహించనికి అవసరమైనటువంటి ఇబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి.

 

6.TSPSC ప్రాసన పైన సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.

 

7. గ్రూప్-1 పరీక్షను వెంటనే నిర్వహించి ఎలక్షన్ల కంటే ముందే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.

 

 

8. రాజకీయ పునరావసన కేంద్రంగా కాకుండా అర్హులైన కార్యదర్శకత పాటించే అధికారులను నియమించాలి

 

9.TSPSC బోర్డు చైర్మన్ ,సెక్రటరీలను వెంటనే తొలగించి వారిన అరెస్టు చేయాలి.

 

 

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యుడు వేల్పుల నాగచంద్ర జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్ SFD జిల్లా కన్వీనర్ విష్ణు భక్తుల రిషి సోషల్ మీడియా కన్వీనర్ శ్రీపతి సాయి తేజ పెద్దపల్లి నగర కార్యదర్శి యతిరాజు అజయ్ , జోనల్ ఇన్చార్జులు అరవింద్, రాకేష్, నాయకులు శ్రీనివాస్ ,ఆదిత్య , వంశీ, వివేక్, జితేందర్, నరేష్, అజయ్, తదితరులు, పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.