కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు
ప్రజా గొంతుక అక్టోబర్ ఐదు దేవరకొండ జిల్లా నల్గొండ
-చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై లగేజీ అటోలు, మోపెడ్ బైక్‌లు అందిస్తున్న ప్రభుత్వం
-చేపల పెంపకం కోసం సీడ్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు
-అభివృద్ధిలో, సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా
-గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి
-దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం డిండి ప్రాజెక్టులో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ 14.50లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లల్లో ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్టు ఆయన తెలిపారు.
నియోజకవర్గంలో కోటి ఉచిత చేప పిల్లలను వదలనున్నట్లు ఆయన తెలిపారు.పెరిగిన చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై లగేజీ అటోలు, మోపెడ్ బైక్‌లు, పరికరాలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది అని పేర్కొన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు.చేపల పెంపకం కోసం సీడ్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.చేప పిల్లలను వందశాతం సబ్సిడీతో చెరువులు, కుంటల్లో వదిలేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన అన్నారు.రైతు బంధు,రైతు బీమా దేశానికి ఆదర్శం అని అన్నారు.అభివృద్ధి లో, సంక్షేమంలో బిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు,వృద్ధులకు తదితరులకు ₹2016, వికలాంగులకు ₹3016 పింఛన్లు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాడం జరిగింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతజనార్దన్ రావు,రైతు బంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావు,స్థానిక సర్పంచ్ మేకల పి ఏ సి ఎస్ చైర్మన్లు మాధవరం శ్రీనివాస్ రావు,తుం నాగార్జున్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పేర్వాల జంగా రెడ్డి,బిఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,అవిరినేని గోపాల్ రావు,ఎంపీటీసీలు వెంకటయ్య, రాధిక,గ్రామ అధ్యక్షుడు గెలమోని శ్రీను,భగవంతు రావు,గొడుగు వెంకటయ్య,తండు చంద్రయ్య,గుర్రం రాములు,శ్రీనివాస్ ఎఫ్ డి ఓ మారయ్య,తండు వెంకటయ్య,శ్రీను,సురేష్,తదితరులు పాల్గొన్నారు.