గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
బొజ్జ చిన్న మాదిగ యం ఆర్ పి యస్ యం యస్ పి సాగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు.
ప్రజా గొంతుక ప్రతినిధి నల్లగొండ ఆగస్ట్ 06
కనీస వేతనాలు లేక, పెరుగుతున్న ధరలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని తెలియజేస్తూ సోమవారం నిడమనూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఈ సందర్భంగా మద్దతిస్తూ మాట్లాడుతూన్నా ఎమ్మార్పీఎస్, సాగర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బొజ్జ చిన్న మాదిగ పాల్గొని మాట్లాడారు. గత 32 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు నిరోధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వారితో చర్చలు జరపకపోవడం,వారి సమస్యను పరిష్కరించకపోవడం గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలుస్తుందని అన్నారు. గ్రామాన్ని మురికి కూపం నుండి కాపాడి, చెత్తాచెదారం,
వ్యర్థ పదార్థాలను ఎత్తిపోస్తూ, గ్రామాన్ని పచ్చదనంగా ఉంచడంలో గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని, హీనమైన పనులు చేస్తున్న వారిపట్ల ప్రభుత్వం హీనంగా ప్రవర్తించడం సరైంది కాదని వారు అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల, వెల్ఫేర్ ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే, 10 లక్షల రూపాయలు చెల్లించాలని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరారు, వెంటనే ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వ సానుకూలంగా స్పందించి డిమాండ్లను పరిష్కరించేంతవరకు మొక్కవోని దీక్షతో కార్మికుల అంతా ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో.. గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొమ్ము కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రెమడాల రాములు, కూనపురి సత్యనారాయణ, ఊర విజయ్, నరసింహ, ధీరావత్ కృష్ణ. ఆదిమల్ల క్రాంతి, కొండేటి వెంకయ్య, చిత్రం శ్రీను, బాల నరసింహ, బచ్చలబ్కూరి శంకర్, సైదమ్మ, భాగ్యమ్మ వెంకటమ్మ, వసుమతి తదితరులు పాల్గొన్నారు