స్కీంవర్కర్లు సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి….
ప్రజా గొంతుక ప్రతినిధి/అశ్వరావుపేట నియోజకవర్గం,
ములకలపల్లి మండలం స్కీంవర్కర్లు సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు
ములకలపల్లి మండల కేంద్రంలో ఆశావర్కర్లు, మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసి మాట్లాడుతూ స్కీంవర్కర్లు పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో స్కీంవర్కర్లు పాత్ర కీలకమని ప్రభుత్వం వారితో వెట్టిచాకిరీ చేస్తున్నదని న్యాయమైన వారి డిమాండ్లను పరిష్కరించాలని వేలకోట్ల రూపాయలు సంక్షేమం పేరుతో ఖర్చు చేసే ప్రభుత్వానికి స్కీంవర్కర్లు సమస్యలు భారమైపోయాయా అని విమర్శించారు ఎన్ని నిర్బందాలు ఎదురైనా ఆందోళన కొనసాగించాలని పిలుపునిచ్చారు
స్కీంవర్కర్లు చేసే పోరాటాలకు పార్టీ ఎల్లవేలలా మద్దతు ఉంటుందని తెలిపారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరినారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పొడియం వెంకటేశ్వర్లు, మాలోత్ రావుజా, గౌరి నాగేశ్వరరావు, వూకంటి రవికుమార్, గొగ్గల ఆదినారాయణ, గోపగాని లక్ష్మీ నరసయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.