ఘనంగా చౌదర్పల్లి సతీష్ పుట్టినరోజు వేడుకలు
— పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప
ప్రజాగొంతుక న్యూస్/జనగామ/లింఘాల ఘనపురం:
బీజేపీ లింఘాల ఘనపురం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు చౌదర్పల్లి సతీష్ పుట్టినరోజు వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బేజాడి బీరప్ప పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సతీష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా ప్రతి కార్యకర్త,నాయకులు కృషి చేయాలని కోరారు. పుట్టినరోజు జరుపుకుంటున్న సతీష్ మున్ముందు రాజకీయంగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెవైయం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కన్వీనర్ దూసరి విజయ్ కుమార్,బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బండ ఆంజనేయులు,మాణిక్యాపురం- సిరిపురం ఎంపీటీసీ బర్ల కుమార్,మాజీ సర్పంచ్,ప్యాక్స్ వైస్ చైర్మన్ చౌదర్పల్లి విజయ్ భాస్కర్,కళ్లెం ఎంపీటీసీ మార్పు శ్రీనివాస్ రెడ్డి,ఓబీసీ మండల ఉపాధ్యక్షుడు చౌదర్పల్లి ఉమాకర్,సంపత్,కాల్ల గణేష్,మంగ సోమశేఖర్,పెద్ద ఎత్తున యువత కార్యకర్తలు,మిత్రులు పాల్గొన్నారు.