రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
ప్రజా గొంతుక న్యూస్ /రామగుండం
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ , మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకన్ లతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సీపీ గారు స్వయంగా పోలీస్ అధికారులకు కలిసి సిబ్బంది కి భోజనం వడ్డీంచడం జరిగింది. అనంతరం
సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, ఎలాంటి విఘ్నాలు లేకుండా తాము మొదలు పెట్టిన పనులు పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని, ఇదేరీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ గారు తెలిపారు.
*అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గత ఆరు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను సీపీ గారు ప్రారంబించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో, పోలీస్ అధికారులు సిబ్బంది, పిల్లలు అందరు ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నది లో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి తుల శ్రీనివాసరావు ,పెద్దపెల్లి ఏసిపి ఎడ్ల మహేష్, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, జైపూర్ ఎసిపి మోహన్, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీ మల్లికార్జున్, వివిధ విభాగల ఇన్స్పెక్టర్ లు, పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోనీ సీఐ లు ఆర్ఐలు దామోదర్, మల్లేశం,వామన మూర్తి, శ్రీధర్, విష్ణు ప్రసాద్,ఆర్ఎస్ఐ లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.