రాజకీయాల్లో హరిశ్వర్ రెడ్డి ది ప్రత్యేక స్థానం
*ఘనంగా దివంగత మాజీ డిప్యుటీ స్పీకర్ కొప్పుల హరిశ్వర్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమం.*
*దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, కలెక్టర్, ఎంపి, ఎమ్మెల్యేలు*
*హరిశ్వర్ రెడ్డి చిత్ర పటానికి ఘనంగా నివాళ్ళులు*
*ప్రజా గొంతుక :రంగారెడ్డి జిల్లా బ్యూరో*
పరిగి మాజీ శాసనసభ్యులు, డిప్యుటీ స్పీకర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి దివంగత కొప్పుల హరిశ్వర్ రెడ్డి తనదైన ముద్ర వేసి అందరికి స్ఫూర్తిగా నిలిచిన నేత దివంగత నేత కొప్పుల హరిశ్వర్ రెడ్డి అని మంత్రులు, సబిత ఇంద్ర రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు. ఆనంద్ తదితరులు గుర్తు చేసుకున్నారు. సోమవారం దివంగత డిప్యుటీ స్పీకర్ కొప్పుల హరిశ్వర్ రెడ్డి దశ దిన కర్మ ను తనయుడు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, తదితరులు పాల్గొని వారి చిత్ర పటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమం లో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎంపి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.