అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు విధానం
ప్రజా గొంతుక/ కేసముద్రం/ అక్టోబర్/7
కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉప్పరపల్లి గ్రామ శివారు పంట క్షేత్రంలో అధిక సాంద్రతలో పత్తి సాగు విధానము ద్వారా అధిక దిగుబడి పొందవచ్చునని వరంగల్ నుండి వచ్చిన రీజినల్ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ప్రధాన శాస్త్రవేత్త పత్తి విభాగం డాక్టర్ జి వీరన్న గారు వివరించారు. సాధారణ పద్ధతిలో పత్తి వేసినప్పుడు ఎకరాకు 5000 నుండి 6 వేల మొక్కలు మాత్రమే వేసుకునే అవకాశం ఉందని అదేవిధంగా పంట కాలము కూడా ఎక్కువగా ఉంటుందని వారు వివరించారు అధిక సాంద్రత గల పద్ధతిలో పత్తి సాగు చేసినట్లయితే ఎకరాకు 20వేల మొక్కల నుంచి 25 వేల మొక్కలు వస్తాయని వారు వివరించారు అదేవిధంగా సాధారణ పద్ధతిలో పత్తిలో 6 నుంచి 8 క్వింటాల దిగుబడి వస్తే అధిక సాంద్రత విధానంలో సాగు చేసినట్లయితే ఎకరాకు 12 నుంచి 14 క్వింటాల దిగుబడి వస్తుందని వారు వివరించారు వారు మాట్లాడుతూ ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు మొక్కలు ఎక్కువ ఎత్తులో పెరగకుండా ఉండడమే కాకుండా డిసెంబర్ మొదటివారం వరకు పంట కాలము పూర్తి అవుతుందని వారు వివరించారు. అదేవిధంగా ఏకకాలంలో పంట చేతికి రావడం వలన హార్వెస్టర్ విధానం ద్వారా కూడా పంటను ఏకకాలంలో హార్వెస్టింగ్ చేసుకోవచ్చని వారు వివరించారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శ్రీ డాక్టర్ S. మాలతి గారు మాట్లాడుతూ ప్రస్తుతము మిరపలో వైరస్ తెగులు వ్యాపిస్తునందున మిరపలో తెగులు నివారణ చర్యల మీద పలు సూచనలు చేశారు. అదేవిధంగా ప్రస్తుతము వరి మరియు పత్తిలో పురుగుల మరియు తెగుళ్ల నివారణ చర్ల గురించి వారు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
మహబూబాబాద్ డివిజన్ వ్యవసాయ సహాయ సంచారకులు & ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ మండలంలో కోతుల బాధ ఎక్కువగా ఉన్నందున రైతు సోదరులు కోతుల బాధలేని ఆయిల్ ఫామ్ పంటల వైపు దృష్టి మళ్లించాలని అదేవిధంగా మొక్కలకు డ్రిప్పు పరికరాలకు , అంతర పంటల సాగుకు , ఎరువులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున రైతు సోదరులు మూస పద్ధతులను విడనాడి మంచి దిగుబడినిచ్చే ఆయిల్ ఫామ్ పంట వైపు మగ్గు చూపాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కె వి కే మల్యాల శాస్త్రవేత్తలు డాక్టర్ కిషోర్ కుమార్ మరియు డాక్టర్ క్రాంతి కుమార్ గార్లు మరియు మండల వ్యవసాయ అధికారి, కేసముద్రం బి వెంకన్న మరియు గ్రామ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ సంకు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, బి సుమన్, ఎండి రహీం , డి రాజేందర్, T.మురళి మరియు రైతులు పాల్గొన్నారు.