డా.దివ్య నయన అధ్వర్యంలో ఇంటి,ఇంటి సర్వే
ప్రజా గొంతుక న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
చర్ల మండలం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న
పెద్ద మిడిసిలేరు గ్రామo లో
డా.దివ్య నయన అధ్వర్యంలో
ఇంటి,ఇంటి సర్వే చేసి,
వైద్య శిబిరం నిర్వహించారు.
8 జ్వరం కేసులు నమోదు అయినవి,
మలేరియా లేదు,అన్ని వైరల్ జ్వరాలు.
50 మంది కి సాధారణ వ్యాధులకు చికిత్సచేయడం జరిగినది.
గ్రామాలలో శానిటేషన్ క్రమబద్దం గా చేయాలని పంచాయతీ సిబ్బంది కి సూచించారు.అందరూ దోమ తెరలు తప్పని సరిగా కట్టుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలోహెచ్.ఈ.ఓ బాబురావు,
హెల్త్ సూపర్వైజర్ కనక దుర్గ,
ఎం.ఎల్.హెచ్.పి దీప్తి,హెల్త్ అసిస్టెంట్ కృష్ణవేణి,
ఆశా కుమారి.తదితరులు పాల్గొన్నారు.