*ఎమ్మెల్యే లేకుండా సహకార సంఘం భవనాన్ని ఎలా ప్రారంభిస్తారు*
బీఆర్‌ఎస్ పార్టీకే కాదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చెయ్యాలి.
*బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సారా శ్రీనివాస్
ప్రజా గొంతుక పరిగి డివిజన్ ప్రతినిధి :
పరిగి నియోజకవర్గ, కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన బుయ్యని మనోహర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేయకుండానే కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సహకార సంఘం బ్యాంకు భవనం ప్రారంభోత్సవం చేశారు.
దీనిలో భాగంగా కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే లేకుండానే సహకార సంఘం బ్యాంకును ఎలా ప్రారంభిస్తారని కుల్కచర్ల మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు సారా శ్రీనివాస్ అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ఎక్కడో ఉన్న బుయ్యని మనోహర్ రెడ్డిని దివంగత మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరిశ్వర్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకువచ్చి రాజకీయ పాటాలు నేర్పినారని పేర్కొన్నారు.తాను వెన్ను దండగ ఉండి కుల్కచర్ల మండల జడ్పిటిసిగా గెలిపించి రాజకీయ బిక్ష పెట్టిన కొప్పుల కుటుంబాన్ని మోసం చేయడమే కాకుండా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి,వారి తండ్రి హరీశ్వర్ రెడ్డి చొరవతో డిసిసిబి చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టి బిఆర్ఎస్ పార్టీ తోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇప్పుడు టిక్కెట్టు కోసం బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మనోహర్ రెడ్డి ఆయనను నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను ప్రజలను మోసం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకె కాంగ్రెస్ లో చేరినారు.ఇలాంటి నాయకులు ఎక్కడ ఉన్నా ప్రజలను మోసం చేయడమే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు.