Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మానవాళి మనుగడ సజావుగా జరుగుతుంది

ప్రజా గొంతుక న్యూస్/ ఓదెల

పెద్దపల్లి పోస్టల్ శాఖ అధ్వర్యంలో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని ఓదెల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రమదానం , స్వచ్ఛత ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్, అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో నిర్వహించారు .

 

ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ పోస్టల్ సూపరిండెంట్ పసునూరి ప్రభాకర్ మాట్లాడుతూ, మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని గాంధీ స్ఫూర్తి మేరకు ప్రతి అక్టోబర్ రెండున తేదీన స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.

 

ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఏ ఎస్పి సునీల్ తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఏ మోహన్ పోస్టుమాస్టర్ ఆవిడపు స్వామి, ఆడెపు శివ, మెయిల్ ఓవర్సీస్ లు సబ్ఆఫీస్ పరిధిలోని బిపి ఎంలు, ఏబిపిఎంలతోపాటు పలువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.