*ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి.
*తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉంది
*మాయమాటలు చెప్పి మభ్యపెటే కాంగ్రెస్ నాయకుల మాటలు నమొద్దు.
కాంగ్రెస్ ను నమ్మితే రాష్ట్రం ఆగమైతది…
ఇంటింటి ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్.
*షాద్ నగర్ :ప్రజా గొంతుక ప్రతినిధి*
షాద్ నగర్ మున్సిపాలిటీ 1వ వార్డు ఫరూఖ్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ మాట్లాడుతూ ప్రజలంతా అలోచించి ఓటు వేయాలని కోరారు. తొమ్మిదిన్నర ఏండ్లలో జరిగిన అభివృద్ధి మీ కండ్ల ముందే ఉంది అని అన్నారు.
మాయ మాటలు చెప్పి మమ్మీ పెట్టే కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దని విన్నపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలను నమ్మితే రాష్ట్రమే ఆగమైతది అని అన్నారు.ఈ ప్రచారంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్స్, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.