జనగామలో పోచంపల్లి ప్రచారం చేస్తే వజ్రాయుధం కానుందా …?
అక్కడక్కడ అసమ్మతికి చెక్ పెట్టాలంటే పోచంపల్లి ఎంట్రీ ఇవ్వాల్సిందే
– సినన్న ఎంట్రీ ఇస్తే మారనున్న రూపురేఖలు…
ప్రజా గొంతుక న్యూస్ డేస్క్/ జనగామ
జనగామ నియోజకవర్గంలో పోచంపల్లి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ కు వజ్రాయుధం కానుందా…? నియోజకవర్గంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన సొంత క్యాడర్ కలిగిన వ్యక్తి ఎంట్రీ ఇస్తే బీఆర్ఎస్ పార్టీ రూపురేఖలు మరనున్నాయా….? జనగామ టికెట్ ను ఆశించిన వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒకరు.
అయితే జనగామ బిఆర్ఎస్ టికెట్ ను పలువురు నేతలు ఆశించారు. ఆశించిన వారిలో ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు. బిఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశమీది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా క్యాడర్ ను తనదైన శైలిలో కాపాడుతున్నారు.
జనగామ నియోజకవర్గ ప్రజలలో, నాయకులలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అంటే తెలియని వారు లేరు. ఈ ఎన్నికలలో పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంట పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటే అర్జుని వెంట శ్రీకృష్ణుడు వచ్చినట్టే అని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అక్కడక్కడ అసమ్మతి అనే మాటలను వినపడుతున్న ఈ మాటలకు చెక్ పెట్టాలంటే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్ల గెలుపు కోసం ప్రచారంలోకి రంగంలోకి దిగాల్సిందే… కొందరి అభిప్రాయం.. ఇప్పటికే ప్రతి గ్రామాన పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రజల ఘన స్వాగతం పలుకుతున్నారు. క్యాడర్లో జోష్ నింపుతూ ప్రచారం కొనసాగుతుంది. దీనికి తోడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంటే ఉంటే మరింత గెలుపుకు నల్లేరు పైన నడకల అవ్వవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.