సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తే ఎమ్మెల్యే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు -.
-సిపిఎం
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 18 వలిగొండ. ప్రజా గొంతుక ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ పార్టీ కార్యకర్తలకే కేటాయీంచే ఎమ్మెల్యేలు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పరని డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి మందుల విప్లవ్ కుమార్ అన్నారు.
ఆదివారం రోజున మండల పరిధిలోని గోకారo గ్రామంలో జరిగిన సిపిఎం జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విప్లవకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళలో మళ్లీ గెలవాలని ఆశిస్తున్న బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమల్లో తీవ్రంగా పక్షపాతం వ్యవహరిస్తూ ఆ పార్టీ కార్యకర్తలకే దళిత బంధు,
గృహలక్ష్మి పథకాలను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుంటేనే ఈ పథకాలను అమలు చేస్తామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బహిరంగంగా చెప్పడం సరైంది కాదని . అన్ని గ్రామాలలో ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పర్యటనలు అడ్డుకుంటామనిఈ విధంగా చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు
సంక్షేమ పథకాలు అమలు అనేది అర్హులను బట్టి చేయాలి కానీ పార్టీలను బట్టి కాదని అన్నారు. ఈ విధంగా చేస్తే అర్హులు కాకుండా అనర్హులు సంక్షేమ పథకాలు పొందే అవకాశం ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాలను గ్రామ సభల ద్వారా గుర్తించి జాబితాను తయారు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు
మద్దెల రాజయ్య,సిపిఎం నాయకులు తుర్కపల్లి సురేందర్,పబ్బు నారాయణ,సిపిఎం శాఖ కార్యదర్శి కవిడే సురేష్,దేశపాక బాబు సిరిపంగి శ్రీరాములు,నారీ రామస్వామి,చెరక వెంకటేశం,నారి జంగయ్య,తోరపునూరు శంకరయ్య, పబ్బు నరసింహ,యాదయ్య యాదగిరి, తoదారపెళ్లి గోపాల్ ఆవనగంటి గణేష్,చెర్కలింగస్వామి, శ్రీను,పబ్బు శ్రీకాంత్,తోరపునరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.