పెద్దలపండుగకుఊరెళితే…. ఇంటినీ మొత్తం దోచేశారు.
జిల్లాకేంద్రంలోనిసంతోష్ నగర్ కాలనీలో ఘటన.
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా కేంద్రంలోభారీదొంగతనం జరిగింది.జిల్లాకేంద్రంలోనిసంతోష్నగర్,కాలనీలో నివాసంఉంటున్నసునీత ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువాను పగలగొట్టి దొంగలు ఎత్తుకెల్లారు.
సునీతఅనేఇంటియజమానురాలుపొలంఅమ్మినడబ్బులుఇంట్లోపెట్టినట్లు గడిచిన శుక్రవారం రోజునఅల్లంపూర్,తాలూకా,రామాపురంగ్రామంలో పెద్దల పండుగకు (పెత్తర్ల అమావాస్యకు) వెళ్ళింది.
తిరిగి గురువారం వచ్చి చూస్తే ఇంటికి తాళం ఉందని, లోపలికి వెళ్లి చూస్తేబీరువానుపగలగొట్టి,బీరువాలోఉన్నబంగారు,నగదునుఎత్తుకెళ్లినట్లు ఆమె తెలిపారు.
దొంగతనానికి పాల్పడిన వ్యక్తులుఇంటితాళాలనుపగలగొట్టివాటిస్థానంలో మరో తాళం వేసి వెళ్లారు. ఇంటికి మరో తాళం ఉండడంతో అనుమానం వచ్చిన ఇంటియజమానురాలు(సునీత) బంధువులకు తెలపగా అట్టి తాళాన్ని పగలగొట్టిచూడగాలోపల దొంగతనం జరిగినట్లు గుర్తించారు..దీనిపైబాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చోరి చేసిన వాళ్లను త్వరగా పట్టుకుని నాకున్యాయం చేయాలనిపోలీసులనిఅభ్యర్ధించింది. సంఘటన స్థలాన్నిపోలీసులుపరిశీలించారు.