*అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
*బీఎస్పీ షాద్ నగర్ నియోజకవర్గ దొడ్డి శ్రీనివాస్
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షాద్ నగర్ పర్యటనలో భాగంగా ముందస్తుగా గురువారం బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ దొడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు తుప్పరీ కుమార్ ను అక్రమ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…. అధికార పార్టీ పదేళ్ల పాలనాకాలంలో గత రెండు పర్యాయాలు ప్రజలకి ఇచ్చిన హామీలను అమలుపర్చలేదని ఆరోపించారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, దళితులు, ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు కల్వకుంట్ల కుటుంబం వల్ల అప్పులకుప్పగా మారిందన్నారు. గత నాలుగు సంవత్సరాల కింద షాద్నగర్ లో భారీ బహిరంగ సభలో మాట్లాడిన హామీలను నెరవేర్చి అడుగుపెట్టాలని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే తమపై అక్రమ అరెస్టులు గృహనిర్బంధాలు చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో, అధికారబలంతో పోలీస్ వ్యవస్థని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హంగు ఆర్భాటాలతో ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు సిద్ధమయ్యా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ముందు వాటిని అమలు చేసి కొత్త హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అయిన వారిలో బహుజన సమాజ్ పార్టీ దొడ్డి శ్రీనివాస్ తుప్పరి కుమార్ ఉన్నారు.