*మాయ మాటల కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు
*కాంగ్రెస్ అధికారంలోకి వస్తె 50 సంవత్సరాలు వెనక్కి.
*ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్
కొత్తూరు మండలంలో వివిధ పార్టీలను వీడి బీఆర్ఎస్ లో భారీ చేరికలు
*షాద్ నగర్/ప్రజా గొంతుక ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నాయని ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొత్తూరు మండల. ఇముల్ నర్వ గ్రామ పరిధిలో గిరిజన వసూలు కాంగ్రెస్ పార్టీని వీడి అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అభ్యర్ధి మాట్లాడుతూ… పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి,ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా కార్యకర్తలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె మరో 50 ఏళ్ళు వెనక్కి పోతామని మండి పడ్డారు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటల నమ్మవద్దని హితవు పలికారు. భారీ మెజార్టీతో బి ఆర్ ఎస్ పార్టీని గెలిపించుకుందామని కార్యకర్తలు సూచించారు.