తడ్కల్లో” బీఆర్ఎస్ లో చేరికలు జోరు”
– మంత్రి ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరికలు
కంగ్టి, సెప్టెంబర్ 19, ప్రజా గొంతుక న్యూస్:-
సంగారెడ్డి జిల్లా నూతన తడ్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో వలసలు జోరుగా కొనసాగుతున్నాయని మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ , బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గంగారం, ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి, జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు సర్పంచ్ గడ్డపు మనోహర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రమేష్, సొసైటీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.