మెదక్ జిల్లాకు అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర వస్తువులు రానీయకుండా పకడ్బందీగా చెక్పోస్ట్లో ల నిర్వహణ
చెక్పోస్టుల ఆకస్మిక తనిఖీ.
మెదక్ ప్రజా గొంతుక న్యూస్
పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిది బొడ్మట్ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను మరియు నర్సాపూర్ మల్లన్నగుడి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ మాట్లాడుతూ.. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు చెక్పోస్టులు కీలకపాత్ర వ్యవహరిస్తాయని అన్నారు. జిల్లాలోని 07 చెక్పోస్టులలో సాయుధ బలగాలతో కూడిన పహారాతో పకడ్బందీగా 24×7 చెక్ పోస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజలను ప్రలోభ పెట్టే వస్తువులను జిల్లాకు రాకుండా వివిధ శాఖల సమన్వయంతో 24 గంటల పర్యవేక్షణలో చెక్పోస్ట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. అనంతరం వాహన తనిఖీలు చేసిన వాహన నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించండంతో పాటు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు.