చర్ల సర్పంచ్ కి జాతీయస్థాయి లో ఆహ్వానం
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ప్రతినిధి
పంచాయతీ అభివృద్ధిలో తీసుకోవాల్సిన కార్యచరణపై జాతీయస్థాయిలో హైదరాబాద్లో ఈనెల 4, 5న నిర్వహించే వర్క్ షాప్ కార్యచరణకు రాష్ట్రం నుంచి ఇద్దరు సర్పంచులు హాజరుకానుండగా అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చర్ల మేజర్ పంచాయతీ సర్పంచి కాపుల కృష్ణార్జునరావు ఉన్నారు. పంచాయతీరాజ్ కమీషనర్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.