Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

గ్రామస్థాయి నుండి రాష్ట్రాలు దాటిన సాముల రామిరెడ్డి ప్రస్థానం

 

వెంకటేశ్వరుని సన్నిధిలో సేవ చేయడం వరం 

 

నియామకానికి సహకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు

 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యుడు సాముల

 

ప్రజా గొంతుక న్యూస్/ సూర్యాపేట జిల్లా ఆగస్టు 26

 

హుజూర్‌నగర్‌ మండలంలోని అమర వరం గ్రామంలో జన్మించి

1992 ఆగస్టు11న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బి.ఎ,ఆంధ్రా యూనివర్సిటీ నుండి బి.ఎల్ డిగ్రీ పూర్తి చేసి హుజూర్ నగర్ బార్ కౌన్సిల్ నందు అడ్వకేట్‌గా నమోదు చేసుకొని

మొదట్ లో పూర్వం నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ప్రాక్టీస్ ప్రారంభించి తక్కువ వ్యవధిలో న్యాయవాదిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సాముల రాంరెడ్డి. అనంతరం హైదరాబాద్‌లోని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూనే హుజూర్‌నగర్‌లోని కోర్టులో కూడా తన ప్రాక్టీస్ కొనసాగించి 1994- 98 హుజూర్‌నగర్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగాను 1998లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా

ఎన్నుకోబడి గత 24 సంవత్సరాలుగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ మూడు దశాబ్దాల పాటు కెరీర్‌లో సత్యం పట్ల మక్కువ మరియు న్యాయం కోసం దాహంతో అత్యంత విశ్వాసం మరియు అంకితభావం గల న్యాయవాదిగా కార్పొరేట్ మరియు సర్వీస్ చట్టాలకు సంబంధించి జిల్లా కోర్టులు ట్రయల్ కోర్టుల యందు సివిల్ మరియు క్రిమినల్ విషయాలపై సంపూర్ణ అవగాహనతో సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం న్యాయ మరియు రాజకీయ వ్యవస్థల ద్వారా ఎందరికో సహాయం చేయడం కోసం కృషి చేశారు.ఆయన చేసిన సేవల గుర్తింపుగా 2006 నుండి 2017 వరకు లోక్ అదాలత్ సభ్యునిగాను సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బార్ అసోసియేషన్ సభ్యుని గాను హైకోర్టు బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యునిగాను వృత్తిపరమైన విజయాలు సాధించారుదివంగత మహానేత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య అనుచరునిగా కొనసాగుతున్న సాముల రామిరెడ్డి గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

అనంతరం హుజూర్‌నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగాను జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డారు.రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీగల్ సెల్, ఏపీ. సభ్యునిగా పలు రాజకీయ విజయాలు సాధించారు అందులో భాగంగానే ఆగస్టు 24న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా ఆయన తితిదే పాలక మండలి సభ్యునిగా తన ఎంపికకు సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తన కృతజ్ఞతలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.