Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

*తెలంగాణలో ప్రభుత్వాని ఏర్పాటు చేసేది బిజెపి పార్టీనే*

 

*ఆరు స్కిములతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతుంది*

 

*అవినీతితో కూడుకున్న కేసీఆర్ కుటుంబ పాలనను గద్దెదించడమే బీజేపీ లక్యం*

 

*గత ఎలక్షన్లో ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్*

 

*దొంగ హామీలతో ప్రజలను మోసం చేయడానికి మరోసారి ముందుకొస్తున్న కేసీఆర్*

 

*టైగర్ భాను ప్రసాద్ బీజేపీ శంషాబాద్ మండల కార్యదర్శి*

 

 

*రాజేంద్రనగర్ టికెట్టు యువకులకు ఇవ్వాలి నాకు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి సిద్ధం*?

 

*టైగర్ భాను ప్రసాద్ బీజేపీ శంషాబాద్ మండల కార్యదర్శి*

 

రాజేంద్ర నగర్ :ప్రజా గొంతుక న్యూస్

 

 

రాజేంద్ర నగర్ నియోజకవర్గం, శంషాబాద్ మండలంలో.బీజేపీ శంషాబాద్ మండల కార్యదర్శి టైగర్ భాను ప్రసాద్, మాట్లాడుతూ. రాజేంద్రనగర్ నియోజకవర్గం లో యువనాయకత్వానికి అవకాశం ఇస్తే రాజేంద్రనగర్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తాం. నాకు అవకాశం ఇస్తే రాజేంద్రనగర్ పోటీ చేయడానికి సిద్ధం? సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ గా వ్యవహరించకుండా మ్యానిపెస్టోలో అట్టడుగు వర్గాలకు సంబందించిన అంశాలు పెట్టకుండా లోకల్ పార్టీల లాగా ఒక 6 పాలసిలను మాత్రమే మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది… రాజీవ్ గాంధీ తర్వాత గాని ఇందిరాగాంధీ తర్వాత గానీ రాష్ట్రంలో గాని దేశంలో గాని కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు సమాంత్రం లేకుంట పోయింది. కాంగ్రెస్ పార్టీలో సెక్యూరిజం లేకుండా పోతుంది. రాహుల్ గాంధీ, చిన్న చిన్న ఆరు స్కీములను పెట్టి మీరు ఓట్లు అడిగితే ఇది జాతీయ పార్టీ దిగజారు తనానికి ఇది నిదర్శనం. రాష్ట్రంలో కేటీఆర్, కేసీఆర్, పరిపాలనలో ఎమ్మెల్యేలు గానీ మంత్రులుగాని వాళ్లు సీఎం గారిని కలవలేక పోతున్నారు. ఇంకా ప్రజల నేమ్ పట్టించుకుంటారు కెసిఆర్ గారిది అవినీతితో కూడుకున్న కుటుంబ పాలన… జిల్లాలో ఎక్కడ అసైండ్ భూములు గాని వత్తు భూములను వాళ్లు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఈ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. ఇది రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ప్రజల నోట వినబడుతున్నటువంటి మాట ఇకనుంచి రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో పేద ప్రజల భూమి వద్దకు గాని గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ వద్ద గాని వాక్త భూముల వద్ద గాని కబ్జాలకు పాల్పడితే పేద ప్రజలను ఇబ్బందులు పెడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. 9 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి శూన్యం.రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చే 40% సెంట్రల్ ఫండ్స్ మోడీ ఇస్తున్నారు అని చెప్పకుండా మీ పేరు చెప్పుకొని మీరు ప్రచారం చేస్తున్నారు. దేశానికే వ్యాక్సిన్ అందించిన ఘనత మా నరేంద్ర మోడీ గారిది.రాజేంద్ర నగర్ నియోజకవర్గం బీజేపీ జెండా వేగ్రవేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టేంతవరకు పోరాడుతానని ఈ రాజేంద్ర నగర్ ప్రజలకు మాటిస్తున్నాము అని అన్నారు. పోయిన ఎలక్షన్లో, దళితుని సీఎం చేస్తాం,దళితులకు మూడెకరాలు భూమి ఇస్తాం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం, గెలిచి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ మళ్ళీ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసే చేసి మూడోసారి గద్దెనిక్కాలని ఆలోచిస్తున్నారు. దయచేసి ప్రజలకు తెలియజేయడమేమనగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వము విన్నది కనుక బా అభివృద్ధి చెందాలంటే తెలంగాణలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి కుటుంబ పాలను బిఆర్ఎస్ పార్టీని వీఆర్ఎస్ చేయాలి కేసిఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ పరిమితం చేయాలి.

Leave A Reply

Your email address will not be published.