*బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక
*కాంగ్రెస్ పార్టీలో చేరిన కేతావత్ అజయ్ కుమార్
*పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నేనావత్ బాలు నాయక్
*ప్రజా గొంతుక నవంబర్ 19 నల్గొండ జిల్లా దేవరకొండ
*దేవరకొండ పట్టణంలోని ఐదో వార్డుకు చెందిన బిజెపి పార్టీ యువ నాయకుడు కేతావత్ అజయ్ ఆదివారం దేవరకొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడుతూ
యువ నాయకుడు విద్యావంతుడు కేతావత్ అజయ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ వస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలంగాణలో నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ ఆరోగ్యారెంటీల పథకాల స్కీములను వర్తింపజేస్తారని పూర్తి విశ్వాసం తోనే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. ఆయన రాక కాంగ్రెస్ పార్టీ యువతలలో మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఆయన ఐదో వార్డ్ నుండి బిజెపి వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ద్వితీయ స్థానం సాధించి ఓడిపోయారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎండి యునుస్, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు ,మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్, వార్డు నేతల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ,కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్, పొన్నబోయిన భూదేవి సైదులు, కోర్ర రామ్ సింగ్ ,సాయికుమార్, గణేష్ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని శ్రీధర్ రెడ్డి ,రుక్మారెడ్డి, గౌరీ శంకర్ ,పొట్ట సుగుణయ్య, అల్లావుద్దీన్, వైఎస్ కరుణాకర్, ఉమెర్ ,సుజిత్ కుమార్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు*