బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు
జనగామలో మారుతున్న రాజకీయ పరిణామాలు
పల్లా నాయకత్వంతో గ్రామాల అభివృద్ధి సాధ్యం
–దబ్బకుంటపల్లి గ్రామ సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
బచన్నపేట మండలంలోని బీజేపీ ముఖ్య నాయకులు బిఆర్ఎస్ లో చేరారు.దబ్బకుంటపల్లి గ్రామ సర్పంచ్ ముక్కెర కరుణాకర్ రెడ్డి, కొడవటూర్ ఎంపీటీసీ నీల శైలజ-రమేశ్ ,దబ్బకుంటపల్లి గ్రామ ఉప సర్పంచ్ రాపాక రాజు, వార్డుమెంబర్లు బండకింది చంద్రం, దాసరి కనకవ్వ సత్తయ్య, దాసరి శ్రీలత శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ కొంతం స్వామి, దండు యాదయ్య, దాసరి మల్లయ్య,బడకోలు నర్సింహారెడ్డి,చిర మల్లేశం,బుట్టిరెడ్డి కరుణాకర్ రెడ్డి,మాడిశెట్టి శ్రీనివాస్,దాసరి రాజు,నీలం సిద్దులు లకు జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి అందరినీ బీఆరెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమని బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. పల్లా గెలుపు కోసం నిరంతరం కృషిచేసి మా గ్రామాలలో వేరే పార్టీలకు ఓటు బ్యాంకింగ్ లేకుండా అంత బి ఆర్ఎస్ కే ఓట్లు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు