వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా ,బచ్చన్నపేట మండలం ,లింగంపల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జరిగాయి. జంగిటి విద్యనాథ్, కుందన మల్లేశం, గొట్టం తిరుపతిరెడ్డి ,అన్న బోయిన చిన్న సత్తయ్య, ఆధ్వర్యంలో సుమారు 30 మంది నాయకులు, యువకులు, కాంగ్రెస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ గతంలో కొమ్మురి ప్రతాపరెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని ఈరోజు నీటితో జలకళలాడుతున్న గ్రామాలు ఆనాడు కొమ్మూరి ప్రతాపరెడ్డి చేసిన అభివృద్ధి కారణమని అన్నారు .మరింత అభివృద్ధి గ్రామాలు చెందాలంటే కొమ్మూరినిఎమ్మెల్యేగా గెలిపించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత అందరి మీద ఉందని వారు అన్నారు. కొమ్మూరి గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పొన్నాల కనకయ్య,రాజు ,కుమార్ ,కనకయ్య, రాజు, భాస్కర్ ,ప్రవీణ్ ,రమేష్, నర్సింలు, పెద్ద నరసింహులు, కనకయ్య, లింగం ,చిన్న యాదగిరి ,శ్రీను, మల్లారెడ్డి ,రమేష్ ,మల్లేశం ,రాజు, మల్లేశా, కిష్టన్న ,మల్లన్న ,సతీష్, కనకయ్య ,చిన్న కనకయ్య, యాదయ్య ,నవీన్, నరహరి ,స్వామి తదితరులు పాల్గొన్నారు.