ఎట్టకేలకు హస్తగతమైన హుజూర్ నగర్ మున్సిపాలిటీ
కౌన్సిలర్లతో సహా చైర్మన్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్ లో చేరిక
బీఆర్ ఎస్ కు షాక్ ఇచ్చిన గెల్లి అర్చనా రవి
ప్రజాగొంతుక న్యూస్ /సూర్యాపేట జిల్లా
హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, కౌన్సిలర్స్ గాయత్రి,గుంజ భవాని,సతీష్ లను సోమవారం నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి చైర్మన్ యింటికి వెళ్లి అర్చన రవి ఇంట్లో సమావేశమైన కౌన్సిలర్ లను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.నిన్నటి వరకు ఎమ్మెల్యే కుడి భుజంలా కొనసాగుతూ తన స్నేహితుడికి అండగా ఉంటూ శానంపూడి సైదిరెడ్డి వద్ద ఏ పనినైనా చేయించుకుని స్థాయిలో ఉన్న చైర్మన్ ఒక్కసారిగా కాంగ్రెస్ లో చేరడంతో హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ప్రజల అవకయ్యారు. శానంపూడి సైదిరెడ్డికి బిఆర్ఎస్ పార్టీకి హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో గతంలోనే ఇరువురు కౌన్సిలర్లను టిఆర్ఎస్ సస్పెండ్ చేయగా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరికతో బిఆర్ఎస్ కి హుజూర్ నగర్ లో తీవ్ర షాక్ తగిలి నట్లే హుజూర్ నియోజకవర్గం లో ఉప్పెన లాగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని డిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను సహించలేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లకు కాంగ్రెస్ జెండా కప్పి పుష్ప గుచ్చుఅంద చేసి ఎంపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఎట్టకేలకు హుజూర్ నగర్ మున్సిపాలిటీ హస్తం మయం కావడంతో కాంగ్రెస్ శ్రేణులలో నూతన ఉత్తేజం వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు