కష్టకాలంలో పార్టీని భుజాలపై మోస్తున్న కార్యకర్తల అభిప్రాయం మేరకే కల్వకుర్తి టికెట్ కేటాయించాలి
*ఖచ్చితంగా కల్వకుర్తి లో 2023 లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం*
ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
ఇవాళ కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ అతిథి గృహంలో కల్వకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగున్నర ఏళ్లుగా కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గ్రామ గ్రామాన భుజానమోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయాలని సేకరించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ని కేటాయించాలని వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరిగింది.
అన్ని సర్వేలలో కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్న రిపోర్ట్ ఉందని, బిఆర్ఎస్, బిజెపి నాయకులలో వణుకు మొదలైందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కల్వకుర్తి నుంచి 5 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందో అన్న రిపోర్టు ఆధారంగానే వారికి టికెట్ కేటాయించాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎవరు వచ్చినా స్వాగతిస్తామని కానీ వారికి టికెట్లు కేటాయిస్తే ఇన్ని రోజులు పని చేసినటువంటి కార్యకర్తల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని కావున అధిష్టానం ఆలోచించి అభిప్రాయాలను సేకరించి టికెట్ ను కేటాయించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు నిజాముద్దీన్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్, కల్వకుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీస బాలరాజు,యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అన్వర్ పాషా, కల్వకుర్తి మండల యువజన కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మాలిక్, కల్వకుర్తి మండల సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఐతపాగ సంతోష్, జీడిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు వార్డు మెంబరు రామకృష్ణ, జిల్లెల్ల గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి, వెంకటాపురం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతుగంటి సతీష్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, ప్రతాపరెడ్డి, హసన్, శివకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి,పోతుగంటి కిరణ్, రమేష్ గౌడ్,రవీందర్ ,నంధ్యా నాయక్, వాల్యా నాయక్, బంగారయ్య, నాగార్జున గౌడ్, శ్రీకాంత్ యాదవ్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.