*ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వండి
*కిషన్ రెడ్డి అరెస్టుతో శంషాబాద్ లో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
*బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కోనమల్ల దేవేందర్
ప్రజా గొంతుక :శంషాబాద్ ప్రతినిధి
బిజెపి దీక్షను భగ్నం చేసి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని అక్రమంగా ధర్నా వేదిక నుంచి అరెస్టు చేయడం ఒక హేయమైన చర్యగా భావిస్తున్నామని శంషాబాద్ మునిసిపల్ బిజెపి పార్టీ తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శంషాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు కోనమల్ల దేవేందర్ ఆధ్వర్యంలో శంషాబాద్ మునిసిపల్ కేంద్రంలో నిరసన తెలిపి కెసిఆర్ బొమ్మను దహనం చేయడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రేమ్ రాజ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల నందకిషోర్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా
బిఆర్ఎస్ పార్టీ కక్ష పూర్వకంగా వ్యవహరిస్తోంది. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక కేంద్ర మంత్రి అని చూడకుండా అకారణంగా తరలించడం సిగ్గుమాలిన చర్య అని రాష్ట్ర అధ్యక్షుని అక్రమంగా తరలించినందుకు కేసీఆర్ ప్రభుత్వాని వ్యతిరేకించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో, మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, అశోక్ మున్సిపల్ కార్యదర్శి రాకేష్ కిసాన్ మోర్చా అధ్యక్షులు మైపాల్ రెడ్డి ధన్పాల్ రెడ్డి హరీష్ జనార్దన్ మోహన్ రెడ్డి చేతన్ తదితరులు పాల్గొన్నారు