యాదవులను మోసం చేస్తున్న కెసిఆర్
ప్రజా గొంతుకు ప్రతినిధి/అశ్వరావుపేట
నియోజకవర్గం,ములకలపల్లి మండల కేంద్రం లో గల పశువైద్యశాల ఆవరణలో జగన్నాధపురం యాదవ సంఘ నాయకులు ఏర్పాటు చేసుకున్న సమావేశంలో సంఘ నాయకులు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ పధకం ఒక బూటకమని అన్నారు.
గత సంవత్సరం ఆగస్టు నెలలో గొర్రెల కొరకు వడ్డీ కి అప్పు తెచ్చి డిడిలు తీసి నేటికి సంవత్సర కాలం దాటినా ఇప్పటి వరకు గొర్రెల ను అందించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ యాదవులను మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక యం యల్ ఎ మెచ్చా నాగేశ్వరరావు దృష్టి కి తీసుకు వెళ్ళిన ప్రయోజనం లేదన్నారు
ఇంకా రెండు నెలలో ఎన్నికల కోడ్ రానున్నదని ఈ లోపు గొర్రెల పంపిణీ జరగకపోతే రానున్న ఎన్నికలలో యాదవ సోదరులంతా అధికార పార్టీ కి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం మండల పశువైద్యాధికారికి అందచేసారు.
ఈ కార్యక్రమం లోయాదవ సంఘం మండల నాయకులు గుంట్రు. సాయి. సాయిల. కృష్ణా. ముళ్లపూడి. వీరయ్య. వరికుటీ తిరుపతిరావు. మెంతుల కృష్ణా. ఎర్రగొల్ల చిన్నబ్బాయి. ముత్యాలరావు. శ్రీను. చంటి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు