*తండాల గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే
*బిఆర్ఎస్ పార్టీతోనే సబండ వర్గాలకు సమగ్ర న్యాయం
*ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్
*గ్రామ గ్రామాలలోఅంజన్నకు జన నిరంజనం
*భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గిరిజన వాసులు
ప్రజా గొంతుక న్యూస్ :షాద్ నగర్
షాద్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ దూసుకుపోతున్నది. రోజురోజుకూ వేగం పెంచుతున్న కారు పార్టీ గురువారం మరింత స్పీడు పెంచింది. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని చింతనొపు తండా, అవాజ్మీయ పడకల్, గుడ్డలగడ్డ తండా లలో బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేని పోస్టు ను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. తండాలను గ్రామపంచాయతీగా తీర్చిదిద్ది రూపురేఖలు మార్చిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానిదేనని వివరించారు. తండాల అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు.
గ్రామ గ్రామాలలో భారీ ఎత్తున కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మరొక్కసారి గిరిజన వాసులు ఆదరించి ఆశీర్వదిస్తే మరిన్ని సేవలు కొనసాగిస్తామని అంజన్న స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజనవాసులు స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.