గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన కేసీఆర్ సభ
ప్రజా గొంతుక న్యూస్ /పెద్దపల్లి
పెద్దపల్లి బహిరంగ సభలో సీఎం కేసీఆర్.
దాసరి మనోహర్ రెడ్డి వల్లే పెద్దపెల్లి జిల్లా ఏర్పడింది.మనోహర్ రెడ్డి మంచి వ్యక్తి.సర్వేలన్నీ దాసరి గెలుస్తాడని చెబుతున్నాయి.
బహిరంగ సభ కు వచ్చిన జనం చూస్తే, దాసరి మనోహర్ రెడ్డి విజయం ఖాయమని అనిపిస్తుందని అన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో జనవాహిని హాజరైంది. అలా పెద్దపల్లి మొత్తంగా గులాబీమయమైంది. గులాబీ పార్టీ శ్రేణుల్లో జోష్ కనబడగా, హాజరైన జనాన్ని చూసి శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు. ఎవరూ ఊహించని విధంగా ప్రజలు సభకు హాజరయ్యారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రైతులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ప్రభుత్వం సాయం చేసిందని , కరెంటు కోతల నుండి నిరంతర కరెంటు సరఫరా చేసుకునే విధంగా మన రాష్ట్రం ఎదిగిందని
చెప్పారు.రాబోయే రోజుల్లో కొలనూరు, గర్రెపల్లీ, పెద్దపల్లి రూరల్ మండలాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు ఉచిత విద్య అందిస్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే కాలంలో
అగ్రవర్ణాల కులలో పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సభకు వచ్చిన జన ప్రవాహాన్ని చూస్తే లక్ష ఓట్ల మెజారిటీతో మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యేగా
ప్రజలు గెలిపిస్తారని నమ్మకం కలిగిందని అన్నారు. తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు’ వంటి పథకాలను రైతుల కోసం తీసుకొచ్చామని,
ధరణి వల్ల రైతుకు రావలసిన రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలకు సంబంధించిన డబ్బులు
ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతు ఖాతాలో జమ అవుతున్నాయని,
దానివల్ల రైతులు చాలా లబ్ధి పొందుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గం దాసరి మనోహర్ రెడ్డి వల్ల ఎంతగానో అభివృద్ధి చెందిందని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజా నాయకుడిని అసెంబ్లీకి పంపాలని అన్నారు.
సభకు వచ్చిన అశేష జనవాహినికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.