*కెసిఆర్ పాలన రాష్ట్రానికి శ్రీరామరక్ష
*మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పటిష్టమవుతున్న పార్టీ
*షాద్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వై అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపించాలి
*బిఆర్ఎస్ నాయకులు కొప్పుల ప్రదీప్
*ప్రజా గొంతుక : రంగారెడ్డి జిల్లా బ్యూరో ఆర్ఆర్ గౌడ్*
షాద్ నగర్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పితామహుడు, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు నాయకత్వంలో పార్టీ పటిష్టంగా తయారవుతుందన కొప్పుల. ప్రదీప్ అభిప్రాయపడ్డారు.
శనివారం వారం తెలుగు ప్రభ దినపత్రికకు రిపోర్టర్ తో పాలుపంచుకుంటూ షాద్ నగర్ లో అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అభివృద్ధి మరింత జరుగుతుందని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని కితాబునిచ్చారు. రామన్న రాజ్యం రావాలన్నా.. బంగారు తెలంగాణ కావాలన్నా బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు తెలుగు దినపత్రిక రిపోర్టర్కు ఈ సందర్భంగా ఓటర్ మహాశయులు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం రావాలని షాద్ నగర్ అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.