తెలంగాణ కోసం కొట్లాడమే మేము చేసిన పాపమా: సంగిశెట్టి క్రిస్టఫర్
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 18 వలిగొండ ప్రజా గొంతు .ప్రతినిధి
స్వరాష్ట్రం కోసం ఆనాటి సమైక్య పాలకులను ఎదిరించి తెలంగాణ ఏంటో రుచి చూపించి రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ నేటికీ ఉద్యమకారులను గుర్తించకపోవడం దారుణమని తెలంగాణ ఉద్యమకారుల
ఫోరం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్
సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ నాటి ఉద్యమ నాయకుడే నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుల బాధలు తెలిసిన వ్యక్తిగా మరి ఉద్యమకాలను గుర్తించడం లో ఎందుకు ఆలస్యం జరుగుతుందో
అర్థం కావడం లేదన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి నెల నెల పెన్షన్ సౌకర్యం కల్పిస్తుందని అనేక రాయితీలతో అక్కడి ప్రభుత్వం ఉద్యమకాలను గుర్తిస్తుందని ఆదుకుంటున్నదని క్రిష్టఫర్ గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నట్లుగానే మరి ఉద్యమకారులకు కూడా ఉద్యమకాల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు
ఝార్ఖండ్ ఉత్తర్ఖండ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు అక్కడ ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తూ గౌరవేతనవిస్తూ అనేక రాయితులతో కూడుకున్న పథకాలు ఉద్యమకారులు ఇవ్వడం శుభ పరిణామం అని మరి మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకాలను గుర్తించి
దళిత బంధు డబల్ బెడ్ రూమ్ వాటిలో ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలని క్రిస్టఫర్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎస్కే చాంద్ సంగిశెట్టి జనార్ధన్ ఉమా. రాజు. కళ్యాణి. శ్రీనివాస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు