Welcome To Prajagonthuka Digital, Which Provides Latest News In Telugu, Current News Updates

బిఆర్ఎస్ ఉపసర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

 

జోరుగా సాగుతున్న కొమ్మురి ప్రతాపరెడ్డి ఎన్నికల ప్రచారం

 

 

ప్రజా గొంతుక / బచ్చన్నపేట మండలం

 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ స్వాతి వినోద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రచారంలో భాగంగా రామచంద్రపురంలో గ్రామంలో జరుగుతుండగా అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని ఉప సర్పంచ్ స్వాతి వినోద్ రెడ్డి అన్నారు

వారికి కాంగ్రెస్ పార్టీ కండువను కొమ్మూరి ప్రతాపరెడ్డి పార్టీ  కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రపురంలో గ్రామ ప్రజలంతా కొమ్మూరి ప్రతాపరెడ్డి స్పీచ్ ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో ఉండే పల్లా రాజేశ్వర్ రెడ్డి కావాల్నా జనగామ, చేర్యాల ఉండే కొమ్మూరి ప్రతాపరెడ్డి  కావాల్నా మీరు తెలుసుకోండి అని  ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

చేర్యాల అభివృద్ధి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగిందని, మళ్లీ గెలిస్తే జనగామను స్థానికుడిగా మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు గ్రహించాలని, పల్ల గురించి మాట్లాడిన ముత్తిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.