కొండ లక్ష్మణ్ బాపూజీ……. 108 జయంతి వేడుకలు…

., కొండ లక్ష్మణ్ బాపూజీ……. 108 జయంతి వేడుకలు…
సెప్టెంబర్ 27 వలిగొండ ప్రజా గొంతుక ప్రతినిధి….
.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ తవుటం నరహరి.. ఐటి పాముల రవీందర్ మాట్లాడుతూ
క్విట్ ఇండియా పోరాటంలో, గైర్ముల్కి ఆందోళన కార్యక్రమంలో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ మన పద్మశాలి కులంలో జన్మించినందుకు గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు.
ఆయన ఆశలను ఆశయాలను ముందుకు తీసుకపోవుటలో ప్రతి ఒక్క పద్మశాలి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి, , ఐటి పాముల సత్యనారాయణ, జెల్లా నరేందర్, గంజి బాల నరసింహ, రాపోలు శ్రీను ,ఐటిపాముల కుమార్, ఎక్కల దేవి శ్రీను, రమేష్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.