కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి విజయవంతం చేయాలి…
జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి
ప్రజా గొంతుక పెద్దపల్లి:
సెప్టెంబర్ 27న నిర్వహించు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని విజయవంతం చేయాలని జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను సెప్టెంబర్ 27న బుధవారం ఉదయం 11 గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతికి హాజరై విజయవంతం చేయాలని రంగారెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.