*నేషనల్ పెన్సింగ్ క్రీడా పోటీలకు కుల్కచర్ల గ్రామవాసి పార్థసారథి ఎన్నిక
*రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడలో రెండు బంగారు పథకాలు సాధించిన పార్థసారథి
కులకచర్ల, ప్రజా గొంతుక న్యూస్ :
వికారాబాద్ జిల్లా కులకచర్ల గ్రామ నివాసి సామాన్య కుటుంబం ప్రజా గొంతుక దినపత్రిక రిపోర్టర్ కొడుదుటి పెంటయ్య కుమారుడు పార్థసారథి తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాల అకింపేట్ లో విద్యనభ్యసిస్తున్నారు
.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు వరంగల్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్రాస్థాయి 4వ పెన్సింగ్ క్రీడా పోటీలలో అండర్ 17 ఇయర్స్ ఫెన్సింగ్ బాలుర క్రీడా విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇండివిజలుగా మరియు గ్రూప్ విభాగంలో రెండు బంగారు పథకాలు సాధించారు.
చదువుతోపాటు క్రీడలలో ఉన్నతమైన ప్రతిభ కనబరచిన మారుమూల ప్రాంతమైన కులకచర్ల గ్రామ నివాసి కొడుదుటి పార్థసారథికి రాష్ట్రస్థాయి పెన్సింగ్ క్రిడలో ఇది రెండోవసారి 4 బంగారు పథకాలు రావడం జరిగింది. గతంలో కరణం వెంకట్రావు మెమోరియల్ హైస్కూల్లో చదువుకొని నాలుగవ తరగతిలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పాఠశాలకు ఎన్నిక కావడం జరిగింది.చదువుల్లోనూ, క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పార్థసారథి త్వరలో జరుగబోయే మహారాష్ట్ర నేషనల్ పెన్సింగ్ క్రీడలకు ఎంపిక అయ్యారు.
రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఫెన్సింగ్ క్రీడా విభాగంలో రెండు బంగారు పథకాలు సాధించడం గమనార్వం.ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు పలువురు పార్థసారథిని అభినందించారు. రాబోయే కాలంలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని, ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వివిధ యువజన సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు అభినందనలు తెలిపారు.