మెగా జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ:
ప్రజా గొంతుక ప్రతినిధి/ నల్గొండ /మాడుగుల పల్లి
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో హాలియాలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో సెప్టెంబర్ 16వ తేదీన టాస్క్ వారిచే ఏర్పాటు చేయబోయే మెగా జాబ్ ఫెయిర్ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు .
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెగా జాబ్ ఫెయిర్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రముఖ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నందున
నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరనీ తెలిపారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్,పట్టణ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు,కౌన్సిలర్ ప్రసాద్ నాయక్,నడ్డి బాలారాజు యాదవ్, మార్కెట్ డైరెక్టర్ సురభి రాంబాబు,పగిల్ల సైదులు, యూత్ అధ్యక్షుడు సైదా చారి,నడ్డి సత్యం, అజగర్,జింకల ప్రసాద్,కొండేటి అశోక్,బీఆర్ఎస్వి నాయకులు పాల్గొన్నారు.