అబ్రహాం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నామనీ,పార్టీని,కాదన్న ఐజ మండలబీఆర్ఎస్,నాయకులు
ప్రజా గొంతుక న్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి.
జోగులాంబగద్వాలజిల్లా అలంపూర్,నియోజకవర్గం ఐజ టౌన్ లోని రాయల్ ఫంక్షన్ (రెడ్డి) హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబ్రహంఎమ్మెల్యేఅభ్యర్థిత్వాన్నివ్యతిరేకిస్తున్నట్లు అయిజ మండల బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులుస్పష్టంచేశారు.
ఈసందర్భంగాపలువురు బి ఆర్ ఎస్ నాయకులు మీడియాతోమాట్లాడుతూ,ప్రహ్లాద్,రెడ్డి,కిషోర కుమార్,రఘునాథ రెడ్డి,బిఆర్ఎస్ఐజమండల అధ్యక్షులు, భూo పురం నరసింహారెడ్డి, తిప్పారెడ్డి,రాముదయాల్,కెసిఆర్,నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమపథకాలుబాగున్నాయి కానీ, తాజా ఎన్నికలకు అభ్యర్థిని ప్రస్తుత ఎమ్మెల్యేను ప్రకటించినందువల్ల అలంపూర్,నియోజకవర్గపరిధిలోకమిషన్లు,అవినీతి,దౌర్జన్యకాండ రోజు రోజుకిపెరిగిపోతున్నయనిఅలంపూర్,నియోజకవర్గంలలోని ప్రజలకు బి ఆర్ఎస్ పార్టీ పైన కానీ,కెసిఆర్,నాయకత్వం పైన గానీ,ఎమ్మెల్సీ చల్లావెంకట్రామిరెడ్డి నాయకత్వం పైన కానీ నమ్మకంఉన్నదనీ,ప్రస్తుతoఅలంపూర్,తాలూకాలోముఖ్యమైనకార్యకర్తలందరూనీతి,నిజాయితీ, సంక్షేమం,అభివృద్ధి ఆశిస్తున్న నాయకుని వెంట ఉన్నామని వారు పార్టీ అధిష్టానం దృష్టికి తెలియజేస్తూ,కమిషన్లు, అవినీతి ,దౌర్జన్యం ,రియల్ఎస్టేట్అక్రమాలుచేసేవాళ్లుఒకవైపుఉన్నారనీ, అందువలన అబ్రహం నాయకత్వంలో తాము పనిచేయలేమని,అభ్యర్థినిమార్చినట్లయితేతామంతా కలిసి సంపూర్ణ మద్దతును తెలియజేసి, గతంలో కంటే భారీ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించి సీఎం కేసీఆర్ కుకానుకగాఅందజేస్తామని వారంతా తమ ముక్తకంఠంతోనినదించారు.
మొదటిసారిఅబ్రహంఎమ్మెల్యే అయినప్పుడు రెండు చేతులతో దోపిడీ జరిగింది కానీ ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినతర్వాతనాలుగు చేతులతోదోపిడీజరుగుతున్నదని ఇది అందరికీ తెలిసినవిషయమేననీ,అలంపూర్ తాలూకా బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గత రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేఅబ్రహం కివ్యతిరేకగళంవినిపిస్తూనే ఉన్నామనీ, అయినా ఎమ్మెల్యే అబ్రహం తీరు మారలేదనీ,టెంపుల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్లకుకూడాడబ్బులు తీసుకునినియమించడంఎంతవరకుసమంజసమనీ,ఇవీ వాస్తవం కాదాఅనిఈసందర్భంగా నాయకులుమాట్లాడతూఅబ్రహాంనాయకత్వంలో పని చేయలేమనీ, తేల్చి చెప్పారు.
అంతేగాకవచ్చేఎన్నికల్లో అబ్రహామ్ కు ఓట్లు వేసే ప్రసక్తి లేదని వారుస్పష్టం చేశారు.గతనాలుగేళ్లుగా ఆయన నడవడిక సరిగా లేకపోవడం, ఒంటెద్దు పోకడలతోప్రజలు,నాయకులుతీవ్రఇబ్బందులకు గురయినామని వారు తమఆవేదననువెలగక్కారు.
ఆయన చేసిన అవినీతి వల్లఅలంపూర్,అభివృద్ధి కుంటుపడుతుంద న్నారు. అందరూ కలిసి కట్టుగా ఉండిఅబ్రహాంకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని నిర్ణయం తీసుకున్నామనీ వారు మీడియాకుతెలియజేశారు.
ఐజ మండల బి ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అలంపూర్బిఆర్ఎస్,టికెట్నుమార్చిఎవరికిచ్చిన, అత్యధికమెజార్టీతోగెలిపించగలమనిముఖ్యమంత్రి కేసీఆర్ ని, మంత్రి నిరంజన్ రెడ్డి ని ఎమ్మెల్సీచల్లావెంకట్రామిరెడ్డిని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్సీనియర్,నాయకులుసర్పంచులు,ఎంపీటీసీలు వివిధగ్రామాలప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.