కాంగ్రెస్ కు రాజీనామా నేడు కారెక్కుతున్న నాయకులు..
బీఆర్ఎస్ లో చేరుతున్న పీసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ కౌన్సిలర్ శాంతమ్మ, ఆమె కుమారుడు బీఎస్ సుదీర్
షాద్ నగర్ :ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి
షాద్ నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆదివారం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పీసీసీ సభ్యురాలు, షాద్ నగర్ మున్సిపాలిటీ 8వ వార్డు ఆర్టీసీ కాలనీ కాంగ్రెస్ కౌన్సిలర్ శాంతమ్మ, ఆమె కుమారుడు, యువజన కాంగ్రెస్ ప్రధాన నాయకుడు సుధీర్ లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో షాద్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. మున్సిపాలిటీలో ఉన్న ఇద్దరి కాంగ్రెస్ కౌన్సిలర్లల్లో ఒకరు పార్టీకి రాజీనామ చేయడంతో పార్టీ మరింత డీలా పడిపోయింది. వీళ్లతో పాటు అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ను వీడి పార్టీలో చేరుతున్నారు. అదే విదంగా ఎనిమిదో వార్డు గులాబీ మయంగా మారిందని వార్డు ప్రజలు, నాయకులు, సంబరపడుతున్నారు. భారీ మెజార్టీతో అంజన్నను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.