*నియోజకవర్గ ప్రజలే నా బలం నా బలగం*
*రాజేంద్రనగర్ ప్రజలకు సేవ చేయడమే నా కర్తవ్యం*
*అంటున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను
*భారీ మెజార్టీతో గెలిపించుకుందాం
*నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్*
రాజేంద్ర నగర్ , అక్టోబర్20 (ప్రజా గొంతుక ):
రాజేంద్రనగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టీ ప్రకాష్ గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ సందర్భంగా, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ శంషాబాద్ మున్సిపాలిటీ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దూడల వెంకటేష్ గౌడ్, మాట్లాడుతూ…. తెలంగాణలో నవంబర్ ముప్పై తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది. అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది. తెల్లరేషన్ కార్డున్న ప్రతి పేదింటికి కేసీఆర్ బీమా పథకం కింద రూ. 5 లక్షలు బీమా ఇవ్వడం.. ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామనడం, ప్రతి పేదింటి మహిళకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం
పేదల పట్ల మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రస్తుతం ఉన్న ఆసరాను రూ.5వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు పెంచడం అభాగ్యులకు ఆర్థిక భరోసానివ్వడమే అని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు పంటపెట్టుబడి, జర్నలిస్టులకు 400 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం,
సాయాన్ని రూ.16వేలకు పెంచడం కూడా మరోకసారి రైతాంగం పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న శ్రద్ధకు ఉదాహరణ. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రైతులను, మహిళలను, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం కేసీఆర్ గారి కార్యదక్షతను తెలియజేస్తుంది.బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. గతంలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ గెలిచినంక ప్రతి మండలము ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సారధ్యంలో జరిగాయి. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నాని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటున్న.ఏ ఆపద వచ్చినా నేను అండగా నిలుస్తానని అన్నారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అన్నారు.గతంలో నెర్రెలుబారిన నేలలు, బీడు భూములు కనిపించేవి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో తెలంగాణ భూములు ఈరోజు పచ్చబడ్డాయి. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు దర్శనం ఇస్తున్నాయి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ప్రజలకు ఈ సందర్భంగా శంషాబాద్ మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, దూడల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను భారీ మెజార్టీతో మరో మారు గెలిపించుకుందామని కోరడమైనది.