ఇందిరమ్మ రాజ్యం సాధిద్దాం– ఇందిరమ్మ ఇండ్లు నిర్మిద్దాం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
ఈరోజు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తూ ఇందిరా గాంధీ సేవలను గుర్తు చేసుకుంటూ, బచ్చన్నపేట మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు జంగిటి విద్యనాథ్ మీడియాకు ప్రకటన ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఓటు ఒక ఆయుధం లాంటిదని, ఓటు ద్వారా అవినీతి పాలనను అంతం చేసి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పిస్తూ, గతంలో ఇందిరాగాంధీ రాజ్యంలో సంక్షేమ పాలన నడిచిందని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం అమలు చేసి నిరూపించిందని, పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఓ గూడు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. పేదవాడికి వైద్యం అందాలని అనేక ఆసుపత్రులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ది అన్నారు.
ప్రస్తుతం జరగబోతున్న ఎన్నికల్లో జనగామ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్క ఓటర్ ప్రజానీకం గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. స్థానికుడైన కొమ్మూరి ప్రతాపరెడ్డి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సేవే లక్ష్యంగా అందుబాటులో ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని అన్నారు.