తుక్కుగూడ బహిరంగ సభను విజయవంతం చేద్దాం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
డిసిసి జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి పిలుపుమేరకు
కొమ్మూరి యువసేన యూత్ నాయకులు నల్ల గోని వేణు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు జరుగబోయే హైదరాబాదులోని తుక్కుగూడ భారీ బహిరంగ సభను విజవంతం చేయాలని మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, యూత్ నాయకులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమానికి భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే,సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ దేశంలోని వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వివిధ శాఖల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు.
ఈరాష్ట్రంలో 9 సంవత్సరాలు అధికారంలో వున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి వాళ్ళు ఇంతకుముందు మేనిఫెస్టోలో ప్రకటించిన పనులను ఏ మాత్రం చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారని అన్నారు.బహిరంగ సభలో కేసీఆర్ ప్రజలకు చేసిన మోసం,కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అందించే అనేక సంక్షేమ పథకాలు కొత్తగా ఏమి చేర్చారో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఈ బహిరంగ సభ ద్వారా నాయకులు తెలియజేస్తారని పేర్కొన్నారు.
తుక్కుగూడలో నిర్వహించె ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు.