*ఐలమ్మ తెగువను స్మరించుకుందాం
*శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ కులన్ సుష్మా మహేందర్ రెడ్డి ,*
*హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకం*
*నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్*
*చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా జయంతి నివాళులు*
*ప్రజా గొంతుక న్యూస్ :రంగా రెడ్డి జిల్లా బ్యూరో,ఆర్.ఆర్.గౌడ్*
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ కూలన్ సుష్మా మహేందర్ రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్.సుష్మా మహేందర్ రెడ్డి, ఘనంగా నివాళులు అర్పించారు.
స్థానిక మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నర్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్ వై కుమార్, మునిసిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, ఘనంగా జయంతి వేడుకలు జరిపారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్. గణేష్ గుప్తా చెప్పుకొచ్చారు.
హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని వివరించారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని వై.కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో, రజక సంఘం నాయకులు కౌన్సిలర్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.