మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
:- ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి
ప్రజా గొంతుక న్యూస్/చిన్నంబావి ప్రతినిధి/సెప్టెంబర్ 29
ఎమ్మెల్యేరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చేప పిల్లలను పెంచి వివిధ రిజర్వాయర్లలో చెరువులలో నదులలో మత్స్యకారుల కోసం నాణ్యమైన చేపల పెంపక కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు అదేవిధంగా చిన్నంబావి మండలంలోని చెల్లెపాడు గ్రామంలో కృష్ణా నదిలో ప్రభుత్వ మత్స్య శాఖ ఆధ్వర్యంలో 26 లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఉచిత చేప పిల్లల పంపిణీ చేపట్టారు చెరువుల్లో నీళ్లు విప్లవం మొదలైందని మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించుకుని చెరువులలో చేప పిల్లలని వదలడం ద్వారా మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయన్నారు
ముఖ్యమంత్రి చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని దీనితో మాంసం ఉత్పత్తిలో తెలంగాణ ఐదవ స్థానంలో ఉందని అన్నారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన నడుస్తుందని సామాన్యులకు ప్రభుత్వం ఎల్లవేళల రుణపడి ఉంటుందని అందులో భాగంగానే రైతు రుణమాఫీ రైతుబంధు దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు వృద్ధులకు పెన్షన్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యశ్రీ అపనాస్తం అందిస్తున్నామని అన్నారు కొందరు ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేపడుతూ ఉన్నది లేనట్లు లేనివి ఉన్నట్లు అనేక చిల్లరమళ్ళరా ప్రచారాలు చేపడుతూ ప్రభుత్వాన్ని పలుచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇది ఎప్పటికీ జరగాని ఆయన అన్నారు
వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు కార్యక్రమంలో వనపర్తి జిల్లా హత్య శాఖ ఏడి రెహమాన్ జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ ఎంపీపీ సోమేశ్వరమ్మ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఈదన్న యాదవ్ అభిలాష్ రావు వివిధ గ్రామాల సర్పంచులు పల్లె మధు రామస్వామి నరసింహ చక్రవర్తి ఎంపీటీసీలు అధికారులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు