గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు
ప్రజా గొంతుక అక్టోబర్ 9 దేవరకొండ జిల్లా నల్గొండ
-అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం
-బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వలసలు
– ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తాం
-దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 40మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలోకి చేరిన వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…… అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని ఆయన తెలిపారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. అనేక మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. ప్రతీ పల్లెకు పక్కా రోడ్డును నిర్మించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద మేనమామ కట్నంగా ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సలహాదారుడు మారుపాకుల సురేష్ గౌడ్,వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి,నాగవరం నరేందర్ రావు,నాగవరం వెంకటేశ్వర్ రావు,మునుకుంట్ల వెంకట్ రెడ్డి,రాజు రావు,బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.