ఘనంగా సదుల బతుకమ్మ సంబరాలలో
పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ సొరగంటి అర్జున్
ప్రజా గొంతుక :రంగారెడ్డి జిల్లా బ్యూరో
బడంగ్ పెట్ మున్సిపాలిటీలోని వసంత విహార్ ఫేస్ వన్ కాలనీ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ సొరగంటి అర్జున్ పాల్గొన్నారు.సద్దుల బతుకమ్మ పండుగను ఆడపడుచులు, ఘనంగా తంగేడు పువ్వు గునుక పువ్వు రంగు రంగుల అలంకారంలో పేర్చి బతుకమ్మను పూజించారు గ్రామాలలో ప్రధాన కోడలు ఓచోట చేర్చి మహిళలు బతుకమ్మ ఆటలు ఆడి అనంతరం చెరువులో నిమజ్జనం, ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..దసరా ప్రజల జీవితాలలో కొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ, దసరా పండుగ మనిషిని మంచిమార్గంలో నడిపించడానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ అత్యంత ఆనందంతో పండుగ జరుపుకోవాలని, తొమ్మిది రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్న ప్రజలు విజయదశమిని దసరా ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ బడంగ్ పేట్ మున్సిపాలిటీ లోని వసంత్ విహార్ పేస్ వన్ కాలనీలో ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి భీమ్ రెడ్డి రాఘవేంద్ర గౌడ్, అమడాపురం రాజు గౌడ్ శ్రీనివాస్ రెడ్డి రవికుమార్ శ్రీనివాస్ మరియు మహిళా సోదరీమణులు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ